ఇటీవల గుజరాత్‌లోని మోర్బీ వంతెన కూలడంతో 135మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో ప్రధాని మోదీ పర్యటించి.. బాధితులకు నష్టపరిహారం ప్రకటించారు కూడా. అయితే, ఈ విషయంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయట. మోదీ పర్యటన కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.30కోట్లు ఖర్చు చేసిందట. కాగా.. బాధితులకు మాత్రం ఒక్కో కుటుంబానికి రూ.4లక్షల చొప్పున.. మొత్తం రూ.5కోట్లు చెల్లించినట్లు ఆర్టీఐ ద్వారా తేలిందట.