తంబళ్లపల్లె: కేజీబీవీ విద్యార్థులకు హెల్త్ కేర్ శిక్షణ

సమగ్ర శిక్షా వృత్తి విద్యా కార్యక్రమంలో భాగంగా తంబళ్లపల్లె KGBVS విద్యార్థులకు హెల్త్ కేర్ శిక్షణ ఇస్తున్నారు. శనివారం పట్టణంలోని శ్రీ విద్య ఎమర్జెన్సీ ఆసుపత్రిలో విద్యార్థినులకు శిక్షణ మొదలైంది. గైడ్ టీచర్ మల్లిక ఆధ్వర్యంలో 13 మంది విద్యార్ధినులకు ప్రథమ చికిత్స, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, బేసిక్ నర్సింగ్ సేవలు, బయోలాజికల్ వేస్ట్ మేనేజ్మెంట్‌పై 10 రోజులు శిక్షణ ఇస్తామని వైద్యులు వెంకట్ చెప్పారు.