
AP: ప్రాణం పోతున్నా ప్రయాణికుల కోసం మృత్యువునే ఎదిరించారు RTC డ్రైవర్ శివ. కాకినాడ నుంచి విశాఖ వెళ్తున్న బస్సులో ఆయనకు ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చింది. తన ప్రాణం పోయే పరిస్థితిలోనూ ఆయన ప్రయాణికులను సేఫ్‌గా ఉంచేందుకే ప్రయత్నించారు. నొప్పిని లెక్కచేయకుండా స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకుని బస్సును సురక్షితంగా పక్కకు ఆపేశారు. 40 మంది ప్రాణాలను కాపాడి, ఆ సీటులోనే తుదిశ్వాస విడిచారు. * సెల్యూట్ శివ