నిజమైన బలవంతుడు ఎవరు?
లావుగలవాని కంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!
తాత్పర్యం: కొండంత ఏనుగును మావటివాడు తన తెలివితో అదుపులో ఉంచుకుంటాడు. ఇదే రీతిన శారీరక బలం కలిగిన వాడి కంటే ఆలోచించి ప్రవర్తించే నీతిపరుడే అత్యంత బలవంతుడు.
<<-se>>#PADHYAM<<>>