కొత్తపల్లిలో మహిళా సంఘాల భవనానికి భూమిపూజ

కొత్తపల్లి గ్రామంలో నూతన మహిళా సంఘాల (ఐకేపీ) భవన నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ సునీత, మహిళా సంఘాల ప్రతినిధులు కలిసి ఈ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. PACS ఛైర్మన్ రాజేశ్ ఖన్నా, సెక్రటరీ పోశాల దివ్య, గ్రామ పాలకవర్గ సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మహిళల స్వయం ఉపాధి, సమావేశాల నిర్వహణకు ఈ భవనం ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.