
వర్షాకాలం మొదలైంది. మంచినీటి పైపులైన్లలో డ్రైనేజీ నీరు కలిసి కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ. ఆ నీటిని తాగితే డయేరియా, కలరాతో పాటు రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అందుకే నీటిని మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలని సూచిస్తున్నారు. దీనివల్ల నీటిలోని హానికరమైన బాక్టీరియా, వైరస్ నశిస్తాయని, జీర్ణక్రియ కూడా వేగంగా జరుగుతుందని పేర్కొంటున్నారు. Share It