పెళ్లికి ముందు లైంగిక సంబంధాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఇద్దరు అవివాహిత వయోజనులు (Adults) పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకుంటే దాన్ని తప్పుగా చూడలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలో గాజుల తిరుపతి అనే వ్యక్తి ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికవ్వగా, 2014లో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని బోర్డు పోస్టింగ్ ఇవ్వలేదు. తాజాగా కోర్టు అతడికి అనుకూలంగా తీర్పు చెబుతూ.. శారీరక సంబంధం ఉంటే క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమని తెలిపింది.