క్లాసుల్లోకి పిల్లలను ఎలా స్వాగతించారో చూడండి
కేరళంలో నూతన విద్యా సంవత్సరం ఎంతో అందంగా ప్రారంభమైంది. సరికొత్త ఆశలతో బడికి వస్తున్న చిన్నారులకు ఉపాధ్యాయులు సంప్రదాయబద్ధంగా హారతులిచ్చి, తిలకం దిద్ది, ప్రేమతో స్వాగతం పలికారు. పిల్లలు కూడా తమ గురువుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అపారమైన ప్రేమ, ఆత్మీయతల మధ్య సాగిన ఈ స్వాగతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.