RCB జెర్సీలో నాలుగేళ్ల పవర్‌ హిట్టర్.. నెట్టింట వైరల్

సరిగ్గా బ్యాట్ పట్టుకోవడం కూడా రాని వయసులోనే ఓ పిల్లాడు ఫాస్ట్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతున్నాడు. కేవలం 4 ఏళ్ల 4 నెలల వయసున్న ఓ చిన్నారి బాక్స్ క్రికెట్‌లో పవర్‌ఫుల్ షాట్లతో అదరగొడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. RCB జెర్సీ ధరించిన ఆ బుడతడి అద్భుతమైన టైమింగ్, బ్యాటింగ్ శైలి చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘ఇతను భవిష్యత్తులో RCB జట్టుకు ఆడటం ఖాయం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.