వైభవ్‌కి తప్పిన ప్రమాదం.. అలాంటి బాల్స్ కరెక్ట్ కాదన్న పఠాన్

IPL: క్వాలిఫయర్-2లో వైభవ్‌కు ప్రమాదం తప్పిన వీడియో వైరల్ అవుతోంది. రబాడ 145+ కి.మీ. వేగంతో వేసిన బౌన్సర్ తలకు బలంగా తగలడంతో ప్రేక్షకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు అతడికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇది తనకు ఫిల్ హ్యూస్(AUS) ఘటనను గుర్తుచేసిందని ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. 15ఏళ్ల వైభవ్‌ను ఔట్ చేసేందుకు GT బౌలర్లు బాడీ లైన్ బాల్స్ వేశారని, ఒక తండ్రిగా దాన్ని అంగీకరించనని తెలిపారు.