
సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యారు. తండ్రితో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఓ ఫొటోను పంచుకున్నారు. ‘ఎప్పటికీ మీరే నా హీరో.. హ్యాపీ బర్త్‌డే నాన్న’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ కూడా భావోద్వేగానికి లోనై కృష్ణ, మహేశ్ ఇద్దరూ కలిసి నటించిన మూవీ సీన్లను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘వారణాసి’ సినిమాలో నటిస్తున్నారు.