టాలీవుడ్ జేమ్స్ బాండ్.. తొలి సూపర్‌స్టార్

నేడు దివంగత నటుడు, తెలుగు పరిశ్రమ తొలి సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ పుట్టినరోజు. 1943 మే 31న బుర్రిపాలెంలో జన్మించిన కృష్ణ, 1965లో 'తేనె మనసులు'తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్‌కు సినిమాస్కోప్, 70mm&DTS, ఈస్ట్ మ్యాన్ కలర్ టెక్నాలజీలను పరిచయం చేశారు. 'గూఢఛారి 116', 'మోసగాళ్లకు మోసగాడు'తో తెలుగు నాట స్పై, కౌబాయ్ మూవీస్ క్రేజ్ పెంచారు. 1972లో 18 మూవీస్ రిలీజ్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పారు.