Shocking: బాబాగా మారాలని మర్మాంగాన్నే కట్ చేసుకున్నాడు

వెర్రి వేయి రకాలంటే ఇదే. కుటుంబ, ఆర్థిక సమస్యలతో విసిగిపోయిన ఓ రైతు(42) ప్రపంచమే విస్తుపోయే పనికి పాల్పడ్డాడు. తన మర్మాంగాన్ని గొడ్డలితో కట్ చేసుకొని తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిపాలయ్యాడు. ఈ షాకింగ్ ఘటన ఛతర్‌పూర్‌(MP)లో జరిగింది. లైంగిక కోరికలను తొలగించుకుని, బాబాగా మారి దేవుడికి అంకితమవ్వాలని ఇలా చేశాడట. కాగా అతని భార్యకు పక్షవాతం. నలుగురు పిల్లలు. పెద్ద కూతురికి జూన్ 25న పెళ్లి జరగాల్సి ఉంది.