రాయచోటి పీజీ కేంద్రంలో తరగతులు ప్రారంభించాలి
రాయచోటి పీజీ కేంద్రంలో వెంటనే తరగతులు ప్రారంభించి, అవసరమైన కోర్సులు, అధ్యాపకులు, భవనాలు, హాస్టల్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.అంకన్న కోరారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌లను కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్రాన్ని పూర్తిస్థాయి యూనివర్సిటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.