ఫుల్ క్రీమ్ పాలు మరింత హెల్తీ!

చాలామంది చిక్కటి పాలు (వెన్నతీయనివి), పెరుగు తింటే లావైపోతాం, గుండెకు మంచిది కాదని భయపడుతుంటారు. కానీ ఇందులో నిజం లేదని తాజా పరిశోధనలో వెల్లడైంది. ‘రోజుకు 3 సార్లు పాలు తాగినా బరువు పెరగరు. షుగర్ రాదు. ఇందులోని కాల్షియం, విటమిన్-D, ప్రొటీన్లు BPని కంట్రోల్‌లో ఉంచుతాయి. పాలలో ఉండే సహజమైన కొవ్వులు, పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. కాబట్టి భయం లేకుండా పాలు తాగండి’ అని వైద్యులు సూచిస్తున్నారు.