
TG: వేడివేడి పప్పన్నంలో నెయ్యి కలుపుకొని తినడం చాలామందికి ఇష్టం. ఇకపై అలా తినాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. పాలు, వెన్న లేకుండా నెయ్యి తయారు చేస్తున్నారు కల్తీగాళ్లు. HYD కమిషనరేట్ పరిధిలో H-FAST అధికారులు పలుచోట్ల చేసిన తనిఖీల్లో 25.5 టన్నుల కల్తీ నెయ్యిని గుర్తించారు. దాన్ని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు. ఇటీవల గుజరాత్‌లో <<20587968>>30వేల<<>> లీటర్ల కల్తీ నెయ్యి గుట్టు రట్టైన సంగతి తెలిసిందే.