తడి జుట్టుతో నిద్రపోతున్నారా?

తడి జుట్టుతో పడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే జ్వరం, జలుబు వంటివి వైరస్ వల్ల వస్తాయని, వెట్ హెయిర్‌తో నిద్రపోవడం వల్ల కాదని సీనియర్ కన్సల్టెంట్ నీరజ్ కుమార్ వివరించారు. కానీ ఇది మంచి హ్యాబిట్ కాదని చెప్పారు. తలపై ఫంగస్ పెరిగి హెయిర్ డ్యామేజ్‌కు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. పడుకునే ముందు హెయిర్‌ని డ్రయర్ లేదా టవల్‌తో పొడి చేసుకోవాలని సూచిస్తున్నారు.