రాగి జావతో ప్రయోజనాలెన్నో!

రాగి జావ తాగితే షుగర్ నియంత్రణలో ఉండటంతోపాటు చాలా ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ‘రాగిలోని కాల్షియం ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరం. యాంటీ‌ ఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. దాంతో ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. అలాగే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. జావతో ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగి బరువు నియంత్రణలో ఉంటుంది’ అని అంటున్నారు.