
చెప్పులు లేకుండా నడిస్తే ఆరోగ్య ప్రయోజనాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. డైలీ 15-30 నిమిషాల పాటు ఇలా చేస్తే పాదాలు బలంగా మారడంతో పాటు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందని తెలిపారు. అలాగే మంచి బ్యాలెన్స్‌తో శరీర భంగిమకు దోహదపడుతుందన్నారు. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు. అదే సమయంలో వాపులు, స్ట్రెస్ వంటివి తగ్గుతాయన్నారు. పచ్చగడ్డి, ఇసుక, మట్టి ఏదైనా ప్రకృతితో రీకనెక్ట్ చేస్తుందన్నారు.