
ఫ్లాషింగ్ లైట్స్, లౌడ్ మ్యూజిక్ లేదా వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కొందరిలో మూర్ఛ వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీన్ని 'రిఫ్లెక్స్ ఎపిలెప్సీ' అంటారని వివరించారు. తరచూ మూర్ఛ వచ్చేవారిలో ఇది కనిపిస్తుంది. మన చుట్టూ జరిగే కొన్ని మార్పులు, మెదడులో జరిగే అసాధారణ మార్పుల వల్ల ఈ సమస్య తలెత్తుతుందని వివరిస్తున్నారు. సరైన వైద్య సలహాలు, జీవనశైలి మార్పులతో దీన్ని అరికట్టవచ్చని సూచిస్తున్నారు.