పవన్ కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకున్నారు: హరీశ్ శంకర్
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకి డబ్బింగ్ చెప్పే సమయంలో ఒక సీన్ చూసి పవన్ కళ్యాణ్ కంటతడి పెట్టారని డైరెక్టర్ హరీశ్ శంకర్ వెల్లడించారు. సినిమాలో సాలిడ్ డ్రామా, ఇంటెన్స్ సీన్స్ ఉంటాయని, అన్ని రకాల ఆడియన్స్‌ను మెప్పించేలా మూవీ ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ సినిమా నుంచి ఇవాళ 3PMకి మూడో పాట, ఈ నెల 14న ట్రైలర్ రానుంది. 15న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని సమాచారం. ఈనెల 19న సినిమా రిలీజ్ కానుంది.