సంగారెడ్డి: అక్టోబర్‌లో 101 ఏళ్ల బర్త్ డే.. మృతి

సంగారెడ్డి జిల్లా కంగ్టికి చెందిన శతాధిక వృద్ధురాలు గాదె పారమ్మ (101) ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గత ఏడాది అక్టోబర్‌లో ఆమె కుమారులు, మనమలు, ముని మనమలు కలిసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సుదీర్ఘ జీవిత ప్రయాణాన్ని ముగించి ఆమె మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కంగ్టి సర్పంచ్ కృష్ణ, ముదిరాజ్ సంఘం నాయకులు ఆమె మృతికి సంతాపం తెలిపారు.