
ఇప్పటివరకు ఆదివారం జరిగిన WC ఫైనల్స్‌లో భారత్ గెలవలేదన్నారు. నరేంద్ర మోదీ స్టేడియం అచ్చిరాదు, కప్పు సొంతం చేసుకోవడం అసాధ్యమన్నారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్‌ను భారత్ ఓడించలేదని పాత రికార్డులు చెప్పుకున్నారు. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ టీమ్ ఇండియా ప్రపంచకప్ సొంతం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ఆల్‌రౌండ్ షోతో మరోసారి విశ్వవిజేతగా అవతరించింది. Congratulations Team India