
కంటికి ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే గ్లకోమా వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ఎల్.వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సిబ్బంది ఆదివారం బీచ్ రోడ్‌లో వాక్ థాన్ నిర్వహించారు. కాళీమాత ఆలయం నుంచి వైఏంసీఏ వరకు ప్లకార్డులు పట్టుకుని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివాని కొడాలి మాట్లాడుతూ అవగాహన లేకపోతే ఈ వ్యాధి ప్రమాదకరంగా మారుతుందన్నారు. దృష్టిలోపానికి దారి తీసే అవకాశం ఉందన్నారు.