ALERT.. ఈ ఇన్సులిన్ వాడకండి: CDSCO

ఇండియాలో షుగర్ పేషంట్లు ఎక్కువగా వాడే ‘Lantus SoloStar’ ఇన్సులిన్ మందుల బ్యాచ్ (NO. 5F0347B) ఒడిశాలో చోరీకి గురైంది. ఈ నేపథ్యంలో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త హెచ్చరిక జారీ చేసింది. ఈ ఇన్సులిన్‌ను 2°C నుంచి 8°C మధ్య భద్రపరచాలి. సరైన ఉష్ణోగ్రత లేకపోతే మందు శక్తి కోల్పోయి రోగుల ప్రాణాలకు ముప్పు కలగవచ్చు. మందు కొనే సమయంలో బ్యాచ్ నంబర్ చెక్ చేయాలని అధికారులు సూచించారు. share it