HYD: స్మారక స్తూపం వద్ద ఊహకందని అద్భుతం

హుస్సేన్‌సాగర్ తీరంలోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆకాశంలో చంద్రుడు క్రమంగా నీడలోకి జారుకుంటుండగా, సరస్సు నీటిలో ఆ ప్రతిబింబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఖగోళ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ క్షణాలను ఆస్వాదించారు.