ఆంధ్రప్రదేశ్‌ను తెలుగునాడుగా మార్చాలి: గరికిపాటి
కేరళను కేరళం అని మార్చినట్లే ఏపీని కూడా ‘తెలుగునాడు’గా మార్చాలని ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు డిమాండ్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు మాట కాదు. ఉత్తరప్రదేశ్ ఎలానో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులో లేదు. తమిళనాడులా తెలుగునాడు అని మార్చేందుకు మాజీ సీఎం NTR ప్రయత్నించారు. కేరళ వాళ్లకున్న పట్టుదల మనలోనూ ఉంటే మన బతుకులు కూడా మారుతాయి’ అని చెప్పుకొచ్చారు. దీనిపై మీ కామెంట్?