క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో శరీరంలో వచ్చే మార్పులపై అప్రమత్తత అవసరమని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ హెచ్చరించింది. అకస్మాత్తుగా బరువు తగ్గడం, జ్వరం తగ్గకపోవడం, తీవ్రమైన అలసట వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు. అలాగే చర్మం రంగు మారడం, మలమూత్రాల్లో రక్తం పడటం, 4 వారాలైనా గాయాలు మానకపోవడం, మింగడం కష్టమైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. సకాలంలో గుర్తిస్తే క్యాన్సర్‌ను జయించడం సులభం.