ఖమ్మం: హోలీ సందడి షురూ (VIDEO)

ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రంగుల పండుగ హోలీ సందడి ముందే మొదలైంది. చిన్నారులు కర్రలు చేత పట్టి ‘రింగు రింగు బిల్లా’, ‘చింత చెట్టు చిగురు చూడు’, ‘పదహారేళ్ల బండి కట్టి’ వంటి జానపద పాటలు పాడుతూ పల్లెల్లో పండుగ వాతావరణాన్ని నింపుతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ చందాలు సేకరిస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. పాత తరపు ఆచారాలను గుర్తుచేస్తున్న ఈ ఆటపాటలను మీ వయసులో మీరు కూడా ఆడారా? కామెంట్ చేయండి.