కూతుళ్లకు మీరిచ్చే పెద్ద బహుమతి ఇదే!

ఆడపిల్లలున్న తల్లిదండ్రులూ ఇది మీకోసమే. మీ ఇంటి మహాలక్ష్ముల భవిష్యత్తు కోసం కేంద్రం 'సుకన్య సమృద్ధి యోజన' (SSY) పథకాన్ని అమలుచేస్తోంది. ప్రతినెలా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తే వారి చదువు, పెళ్లి కోసం భారీ మొత్తంలో డబ్బులు పొందవచ్చు. ఏటా ₹250 నుంచి ₹1.5లక్షల వరకూ పొదుపు చేయొచ్చు. నెలకు రూ.2వేలు చొప్పున 15ఏళ్లలో రూ.3.6L కడితే 8.2% వడ్డీతో 21 ఏళ్లకు ₹11.08లక్షలు, ₹10k కడితే ₹55.42లక్షలు వస్తాయి.