పునర్వికకు పునర్జన్మ.. మానవత్వం వెల్లివిరిసింది
AP: కర్నూల్‌కి చెందిన చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు మానవత్వం ఒక్కటైంది. అరుదైన <<19227717>>వ్యాధితో<<>> బాధపడుతున్న ఈ పాపకు ₹16కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరం కాగా SM వేదికగా జరిగిన విరాళాల సేకరణ విజయవంతమైంది. దాతలందరూ కలిసి ఆ భారీ మొత్తాన్ని సమకూర్చారు. ఈ సందర్భంగా పాప తండ్రి దాతలకు కృతజ్ఞతలు చెబుతూ ఇక డబ్బు పంపొద్దని వీడియో రిలీజ్ చేశారు. మానవత్వం ఇంకా బతికే ఉందని ఈ ఘటన నిరూపించింది.