ట్విన్స్ డే.. ఒకే చోట 100 మంది కవలలు(VIDEO)

AP: మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు అంటుంటారు. వారు ఎక్కడుంటారో తెలియదుగానీ ఇంట్లో కవలలు ఉంటే అదో అద్భుత అనుభూతి. ఇవాళ ట్విన్స్ డే సందర్భంగా తిరుపతిలో ఏకంగా 100 మంది కవలలు ఒకే చోటకు చేరారు. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. అలాగే ఈ స్పెషల్ డే రోజున నెల్లూరు(D) ఆత్మకూరులోని జిల్లా ఆస్పత్రిలో ఐశ్వర్య అనే మహిళకు కవలలు జన్మించారు. దీంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు.