
ఉదయం క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని దూరం చేస్తుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ‘అధిక వాటర్ పర్సంటేజ్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని మలినాలను బయటికి పంపిస్తాయి. విటమిన్-B6 శక్తినిస్తుంది. విటమిన్-A స్కిన్ గ్లో పెంచుతుంది. విటమిన్-C రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. తక్కువగా ఉండే క్యాలరీలు బరువు పెరగకుండా చేస్తాయి’ అని వివరించారు.