
NTR జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ప్రస్తుతం నలుగురు చిన్నారులు వసతి పొందుతున్నారు. గత దసరా ఉత్సవాల సమయంలో తప్పిపోయిన వీరు పోలీసులకు దొరకగా, వారిని CWC ముందు హాజరుపరిచి ఆశ్రయం కల్పించారు. ఫొటోలో ఉన్న ఈ చిన్నారుల తల్లిదండ్రులు లేదా బంధువుల వివరాలు తెలిసిన వారు 1098 నంబర్‌కి కాల్ చేయాలన్నారు. శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించి, ఆధారాలు చూపి పిల్లలను తీసుకెళ్లాలన్నారు.