కృష్ణా: ఫేక్ ర్యాంకులు చూపి.. రూ. లక్షల్లో వసూలు

VJA, కానూరు పరిసరాల్లో నీట్, JEE కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఫేక్ ర్యాంకులు చూపి ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి రూ.2.5లక్షల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 20 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ, కనీస భద్రత, గుర్తింపు లేని భవనాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. ఫీజులు వసూలు చేసి ఆ తర్వాత అకాడమీ ఎత్తేస్తే గుర్తింపు లేకపోవడంతో చర్యలు తీసుకునే చాన్స్ ఉండదు.