డబ్బు పిచ్చి పట్టడం రోగం: జగపతి బాబు
డబ్బు కోసం ఆరాటపడే జనాల తీరుపై సినీ నటుడు జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘డబ్బు ఉండటం యోగం. డబ్బును అనుభవించడం భోగం. డబ్బు మీద పిచ్చి పట్టడం రోగం. జనాలకు డబ్బు పిచ్చి పట్టింది. సంపాదించడంలో తప్పు లేదు. నిజాయతీగా ఎంతైనా సంపాదించవచ్చు. కొందరికి అది ప్యాషన్. డబ్బును కొంతవరకు మనం సంపాదిస్తే ఆ తర్వాత మనల్ని అది సంపాదిస్తుంది. డబ్బుకు బానిసైతే ఏది మిగలదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.