తల్లే ప్రాణం❤️ ఈ కొడుకును అభినందించాల్సిందే
వృద్ధురాలైన తల్లిని కొడుకు సైకిల్‌పై ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్తున్న దృశ్యం ఆకట్టుకుంటోంది. తల్లి సైకిల్ పైనుంచి పడిపోకుండా అతను తన నడుముకు టవల్‌తో సురక్షితంగా కట్టుకుని తీసుకెళ్లిన తీరు నెటిజన్ల మనసు గెలుచుకుంది. అతనికి ఆ సైకిలే లగ్జరీ కారు.. అమ్మే సర్వస్వం. ఎన్ని కష్టాలున్నా అమ్మను కంటికి రెప్పలా చూసుకోవాలనే గొప్ప సందేశాన్ని ఈ ఘటన చాటిచెబుతోంది. ‘అమ్మపై మమకారం అంటే ఇదే’ అని అంతా కొనియాడుతున్నారు.