'వందేమాతరం' ఆలాపన ఉత్తర్వులపై ముస్లిం బోర్డు అభ్యంతరం

అన్ని స్కూళ్లు, అధికారిక కార్యక్రమాల్లో 'వందేమాతరం' గేయంలోని 6 చరణాలను ఆలపించాలని కేంద్రం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేసింది. లేదంటే కోర్టులో సవాల్ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. 'ఈ పాటలో దుర్గా, ఇతర దేవతల ఆరాధనకు సంబంధించిన పదాలున్నాయి. అల్లాను మాత్రమే ఆరాధించే ముస్లింల నమ్మకాలకు ఇది విరుద్ధం' అని పేర్కొంది.