VIRAL: జీవిత పాఠాన్ని నేర్పిన బామ్మ❤️

వయసు పైబడి ఒంట్లో బలం తగ్గింది. కానీ బాధ్యత ముందు అది భారంగా అనిపించడం లేదు. మనవరాలి చదువు, ఆకలి తీర్చేందుకు రైళ్లలో తినుబండారాలు అమ్ముతూ ఈ బామ్మ చేస్తోన్న పోరాటం ప్రతి ఒక్కరినీ ఎమోషనల్‌కు గురిచేస్తోంది. ‘నా వల్ల కావడం లేదు’ అని కుంగిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకునేవారికి ఆమె జీవితం ఒక నిలువెత్తు పాఠం. ఎన్ని కష్టాలొచ్చినా చిరునవ్వుతో పోరాడటమే జీవితమని నిరూపిస్తున్న ఈ అవ్వకు సెల్యూట్ చేయాల్సిందే.