అసలైన ప్రేమ అంటే ఇదే❤️

పూరీ జగన్నాథుని సన్నిధిలో ఓ అద్భుత దృశ్యం భక్తులను కదిలించింది. అనారోగ్యంతో ఉన్న తన భార్య కోరిక తీర్చేందుకు ఓ వృద్ధుడు ఆమెను భుజాలపై మోస్తూ ఆలయానికి తీసుకెళ్లారు. ఆ జగన్నాథుడిపై ఉన్న భక్తి, ఇల్లాలిపై ఉన్న అనురాగం ఆయనతో ఈ సాహసం చేయించాయి. ఈ ‘అపురూప అనుబంధం’ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘ప్రేమంటే ఇదే కదా!’ అంటూ నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.