
మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీశైలానికి 304 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ సంతోష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 9 డిపోల నుంచి ఈనెల 13న 22 బస్సులు, శివరాత్రి రోజైన 15న అత్యధికంగా 153 బస్సులు అందుబాటులో ఉంటాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.