
'మీసాలపై నిమ్మకాయలు నిలబెడతాం' అనే నానుడిని జీలకర్రగూడేనికి చెందిన బాహుబలేంద్రుని బాలవర్ధిరాజు అక్షరాలా నిజం చేసి చూపించారు. సినీ నటుడైన ఆయన, వృత్తిరీత్యా పొడవాటి మీసాలు పెంచడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. భారీ మీసాలను మెలితిప్పి, వాటిపై నిమ్మకాయలను నిలబెట్టి చూపిస్తున్న ఆయన విన్యాసం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 1958లో శివాజీ గణేశన్ నటించిన 'వీరప్రతాప 1940' సహా పలు చిత్రాల్లో నటించారు.