
నల్గొండ జిల్లాకు చెందిన వెంకన్న యాదవ్‌ను భారత చైతన్య యువజన పార్టీ తెలంగాణ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడిగా నియమించారు. జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ ఈ బాధ్యతలు అప్పగించారు. వెంకన్న యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు నిరంతరం శ్రమిస్తానని, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.