మానవత్వానికే మచ్చ.. తల్లిపై కర్కశంగా కొడుకు దాడి
నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశాడు ఓ కొడుకు. అనారోగ్యంతో మంచంపై ఉన్న 70ఏళ్ల తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకు కర్కశంగా ప్రవర్తించాడు. జుట్టు లాగి, కాలితో తన్ని, పిడిగుద్దులతో 44ఏళ్ల కొడుకు నిషాంత్ ఠాగూర్ దాడి చేసిన దారుణ ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. UP ఘజియాబాద్‌లో జరిగిన ఈ దారుణంపై కూతురి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. (sensitive content)