రూ.36వేల కోట్లతో ఎక్స్‌ప్రెస్ వే.. నెల రోజులు కాకముందే..

యూపీలోని గంగా ఎక్స్‌ప్రెస్ వే నెల తిరగకముందే దెబ్బతినడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు రూ.36వేల కోట్లతో నిర్మించిన ఈ హైవేను ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రారంభించారు. అంతలోనే రోడ్డుపై పగుళ్లు వచ్చాయి. ఓ వ్యక్తి దాని క్వాలిటీ చెక్ చేస్తూ తారు తీయగా అది ఒక్కసారిగా చేతుల్లోకి వచ్చేసింది. కాగా ఈ రోడ్డు నిర్మాణంలో 80% పనులను అదానీ కంపెనీ చేపట్టింది.