రైతన్నకు ఇంత అన్యాయమా.. క్వింటాకు 19 కేజీల తరుగు!
TG: MBNR జిల్లా తాటిపర్తికి చెందిన రైతు తిరుపతయ్య తన 9 ఎకరాల్లో వరిసాగు చేశారు. 480 బస్తాల ధాన్యాన్ని ఆరబెట్టుకొని రైస్ మిల్లుకు తీసుకెళ్లారు. ధాన్యంలో తాలు ఎక్కువగా ఉందని క్వింటాల్‌కు ఏకంగా 19 కేజీల తరుగు తీస్తానని యజమాని చెప్పడంతో రైతన్న కంగుతిన్నారు. జీవితంలో ఇంత అన్యాయం చూడలేదని వీడియో తీసి SMలో పోస్ట్ చేశారు. అధికారులు స్పందించి క్వింటాకు 5 కేజీల కంటే ఎక్కువ తరుగు తీయొద్దని ఆదేశించారు.