మూర్ఖుడు ఎన్ని విద్యలు నేర్చుకున్నా..!

హీను డెన్ని విద్య లిల నభ్యసించిన ఘనుడుగాడు మొరకు జనుడెగాని పరిమళములు గర్దభము మోయ ఘనమౌనె విశ్వదాభిరామ! వినుర వేమ!! తాత్పర్యం: నీచుడు ఎన్ని విద్యలు నేర్చుకున్నా, ఎంత చదువుకున్నా ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. మంచి సుగంధ ద్రవ్యాలను తన వీపు మీద మోసినంత మాత్రాన గాడిద విలువ పెరగదు. మూర్ఖుడు గాడిదతో సమానం. <<-se>>#PADHYAM<<>>