గ్రేట్.. అతనికి నావంతు సాయం చేస్తా: కేటీఆర్

TG: జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న వెంకటరమణ అనే యువకుడికి తన వంతు సాయం అందిస్తానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆయన సంకల్పానికి ఆశ్చర్యపోయానన్నారు. ఆదిలాబాద్‌కు చెందిన వెంకటరమణ కుటుంబ ప్రోత్సాహంతో 2018లో పదో తరగతి పూర్తి చేసి ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్‌గా రాణిస్తున్నారు. ఆయనపై SMలో కథనం రాగా కేటీఆర్ స్పందించారు.