నేడు మెడికల్ షాప్స్ బంద్.. ఇవి ఓపెన్!

ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్(AIOCD) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఇవాళ రిటైల్ మెడికల్ షాప్స్ మూతపడనున్నాయి. ఆన్‌లైన్‌లో మందులు విక్రయించే ఈ-ఫార్మసీ కంపెనీలపై అభ్యంతరాలు తెలుపుతూ బంద్‌ పాటించనున్నాయి. అయితే అపోలో, మెడ్‌ప్లస్ వంటి మెయిన్ చైన్ షాప్స్, హాస్పిటల్ అటాచ్డ్ ఫార్మసీలు, జన ఔషధి కేంద్రాలు, అమృత్ ఔట్‌లెట్స్ తెరిచే ఉంటాయి. అవసరమైన మెడిసిన్స్ కోసం వాటిని సంప్రదించండి.