
TG: భూపాలపల్లి(D) కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ రాత్రి పుష్కర కాలం మొదలవుతుంది. తెల్లవారుజామున 5.30 గంటలకు పుష్కర స్నానాలు ప్రారంభిస్తారు. ప్రభుత్వం రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపు 40 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. RTC 3,360 బస్సులు నడపనుంది. గవర్నర్, సీఎం, మంత్రులకు ఆహ్వానాలు అందాయి.